
ఇంటర్అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. అడ్మిషన్ల పక్రియపై మంగళవారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు. గవర్నమెంట్ కాలేజీల్లో పూర్తి స్థాయి అడ్మిషన్లు జరగాలన్నారు. గ్రామాల నుంచి కాలేజీకి వచ్చే విద్యార్థులకు అనుగుణంగా బస్సుల టైమింగ్స్ మార్చాలన్నారు. 15 కాలేజీలకు హాస్టల్ సౌకర్యం ఉండే విధంగా చూడాలని వెల్ఫేర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫెయిల్ అయి సప్లీమెంటరీ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు స్పెషల్ క్లాస్లు నిర్వహించాలన్నారు. ఎస్సెస్సీ పాసైన విద్యార్థులను కలవడంతో పాటు, గ్రామాల్లో లెక్చరర్లతో ప్రచారం నిర్వహిస్తున్నామని ఇంటర్ నోడల్ అధికారి షేక్సలాం వివరించారు.