ఎకో టూరిజం పనులు స్పీడప్ చేయాలి :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎకో టూరిజం పనులు స్పీడప్ చేయాలి :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ ప్రాజెక్టు వద్ద  చేపడుతున్న  ఎకో టూరిజం పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పనులను పరిశీలించారు. డీలక్స్​ కాటేజీలు, సూట్​కాటేజీలు,  స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్​పనులను వానాకాలానికి ముందే కంప్లీట్​ చేయాలన్నారు. అంతకు ముందు జుక్కల్​ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్​ను తనిఖీ చేశారు.

విద్యార్థులలతో కలిసి భోజనం చేశారు. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే ఆంశాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి,  హౌజింగ్​ పీడీ విజయపాల్​రెడ్డి,  డీపీవో మురళీ ఉన్నారు.ఎస్సెస్సీ ఎగ్జామ్​ సెంటర్​ కు ఫోన్లు తీసుకు రావద్దని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎగ్జామినేషన్​ చీఫ్​సూపరింటెండెంట్లు, అధికారులతో జూమ్​ మీటింగ్​ నిర్వహించారు. డీఈవో రాజు పాల్గొన్నారు.