సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ చంద్రశేఖర్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి :  డాక్టర్ చంద్రశేఖర్
  • డీఎంహెచ్‌ఓ డాక్టర్​ చంద్రశేఖర్​​

కామారెడ్డి, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి డీఎంహెచ్‌ఓ డాక్టర్​ చంద్రశేఖర్​ అన్నారు.  ఆదివారం పాల్వంచ మండలం భవానిపేటను ఆయన విజిట్​ చేశారు.  భవానిపేట పరిధిలో ఇటీవల 8 మందికి డెంగ్యూ నిర్ధారణ అయ్యింది.

పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు.  ఇక్కడ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంపు నిర్వహిస్తోంది. జ్వరాలతో ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు.  టెస్టు కోసం శాంపిల్స్​ సేకరించారు.  ఇంటింటా తిరుగుతూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని,  పరిసరాలు క్లీన్​గా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు.  మాచారెడ్డి పీహెచ్​సీ డాక్టర్​ ఆదర్శ్​ తదితరులు ఉన్నారు.