వ్యూస్, లైక్స్కోసం ఇన్స్టాలో సూసైడ్ పోస్ట్.. ఇంటికెళ్లేసరికి క్షేమంగా ఉన్న యువకుడు.. ఖంగుతిన్న పోలీసులు..

వ్యూస్, లైక్స్కోసం ఇన్స్టాలో సూసైడ్ పోస్ట్.. 	ఇంటికెళ్లేసరికి క్షేమంగా ఉన్న యువకుడు.. ఖంగుతిన్న పోలీసులు..

కామారెడ్డి, వెలుగు: సోషల్ మీడియా ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో వ్యూస్, లైక్స్ కోసం ఓ యువకుడు సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియో తీసి పోస్ట్​ చేయడం చర్చనీయాంశమైంది. ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిలోని ఇస్లాంపూరా ప్రాంతానికి చెందిన రెడ్లాన్ రోహిత్.. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు భావోద్వేగ వీడియో తీసి మంగళవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు. 

ఈ వీడియోను గమనించిన కామారెడ్డి టౌన్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. యువకుడి ఇల్లు తెలుసుకుని అక్కడికి వెళ్లగా అతడు క్షేమంగానే ఉన్నాడు. విచారణ చేపట్టగా, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో వ్యూస్, లైక్స్ కోసం మాత్రమే ఆ వీడియోను పోస్టు చేసినట్లు యువకుడు తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 వ్యూస్​ కోసం ఇలాంటి చేష్టలకు పాల్పడడం బాధ్యతారాహిత్యమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. సోషల్ మీడియా మోజులో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీసుల సమయాన్ని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 
హెచ్చరించారు