కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
  • ఎంపీ రేణుకా చౌదరికి  కమ్మ సంఘం నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయి కోట్ల నిధులతో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కమ్మ సేవా సంఘాల సమాఖ్య జనరల్ సెక్రటరీ గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్, ట్రెజరర్ కండపనేని రత్నాకర్ రావు కోరారు. ఈ మేరకు గురువారం ఎంపీ రేణుకా చౌదరిని బంజారాహిల్స్​లోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గంలో  పేదవాళ్లు ఉన్నారని, వారి చదువులకు ఈ బడ్జెట్ ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు కావాలన్నారు. ఈ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలని రేణుకా చౌదరిని వారు కోరారు. త్వరలోనే తాను సీఎంతో చర్చిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి సీఎం రేవంత్​ న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు.
 
సీఎంకు మాజీ మంత్రి మండవ రిక్వెస్ట్ 

ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న కేబినెట్  నిర్ణయం అభినందనీయమని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు అన్నారు. కమ్మ సామాజిక వర్గంలో మెజార్టీ ప్రజలు పేదరికంలో ఉన్నారని, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు ఉన్నారని గుర్తుచేశారు. కమ్మ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. కమ్మ  సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.