
- అఖిల భారత పద్మశాలి సంఘం డిమాండ్
బషీర్ బాగ్, వెలుగు: పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగంట్ల స్వామి అన్నారు. బుధవారం నారాయణగూడ పద్మశాలి భవన్లో అభినందన సమావేశం నిర్వహించారు. స్వామి మాట్లాడుతూ.. ప్రత్యేక కార్పొరేషన్తో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్న పద్మశాలీలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఏర్పాటుకే పరిమితం అవుకుండా రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరారు.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ కు సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలి నాయకులు గుంటుక రూప, చిన్నకోట్ల స్వప్న, పెద్ది జగదీష్, రాపోలు జ్ఞానేశ్వర్, నల్ల కనకయ్య, మల్లేశం, నోముల రేఖ, చెరుపెల్లి వర్ణలీల, పూర్ణిమ , రుషికృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు