చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్

చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  టెస్టుల్లో  న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన చేసిన బ్యాట్స్మన్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీ చేసిన కేన్ మామ..కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.  ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ నాలుగో రోజు అండర్సన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కేన్ విలియమ్సన్ టెస్టు్ల్లో 7,684 పరుగులు సాధించాడు. ఇక రాస్ టేలర్  112 టెస్టుల్లో 7, 683 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 35 హాఫ్ సెంచరీలున్నాయి. 

రాస్ టేలర్ 112 టెస్టుల్లో 196 ఇన్నింగ్స్‌ల్లో  7,683 పరుగులు సాధిస్తే.. కేన్ విలియమ్సన్‌ కేవలం 92 టెస్టుల్లో  161 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన జాబితాలో స్టీఫెన్ ఫ్లేమింగ్(7172), బ్రెండన్ మెక్‌కల్లమ్(6453), మార్నిన్ క్రోవ్(5444), జాన్ రైట్(5334), టామ్ లాథమ్ (5038) ఉన్నారు.