ఐపీఎల్ నుంచి కేన్ విలియమ్సన్ ఔట్..గుజరాత్ కు షాక్

ఐపీఎల్ నుంచి కేన్ విలియమ్సన్ ఔట్..గుజరాత్ కు షాక్

ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లోనే ఊహించని పరిణామం. మ్యాచ్ గెలిచినా గుజరాత్ టీంకు షాక్ తప్పలేదు. జట్టులో కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ జట్టు నుంచి వెళ్లిపోనున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. బౌండరీ దగ్గర బాల్ ను పట్టుకోబోయి కింద పడ్డాడు. ఈ క్రమంలోనే మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. గ్రౌండ్ లోనే ఫిజియో చేసినా.. నొప్పి తగ్గకపోవటంతో గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 

వైద్య పరీక్షల తర్వాత కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయం అయ్యిందని.. ఎయిర్ ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరం అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ మొత్తానికే కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. గుజరాత్ జట్టులో కేన్ టాప్ బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. అతనిపై జట్టు బోలెడు ఆశలు పెట్టుకుంది. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే.. కేన్ జట్టుకు దూరం అవుతున్నాడనే ఆందోళన ఆ జట్టులో నెలకొంది.

చెన్నై బ్యాటింగ్ సమయంలో.. రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్ కొట్టాడు. బౌండరి లైన్ దగ్గర ఉన్న కేన్.. ఆ బాల్ ను గాల్లోకి ఎగిరి పట్టుకోవటానికి ప్రయత్నించాడు. కంట్రోల్ కాకపోవటంతో బాల్ ను బౌండరి లైన్ లోపలికి విసిరేసి.. కింద పడ్డాడు. ఆ సమయంలో మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే వైద్యులు స్పందించి చికిత్స అందించినా నొప్పి తీవ్రతతో.. గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం వైద్య పరీక్షల తర్వాత గాయం తీవ్రంగానే ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని  గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టన్ వెల్లడిస్తూ.. కేన్ మోకాలికి అయిన గాయం చాలా తీవ్రమైందన్నారు. తర్వాత మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కేన్ 2023 ఐపీఎల్ అన్ని మ్యాచులకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి..