ఆయన నాకు దేవుడితో సమానం.. వైరల్ అవుతున్న కంగనా ఇన్స్టా నోట్

ఆయన నాకు దేవుడితో సమానం.. వైరల్ అవుతున్న కంగనా ఇన్స్టా నోట్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana ranaut) ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల బన్సాలీ(Sanjay leela bansali)ని లివింగ్ లెజెండ్ అంటూ కొనియాడారు. అయన తనకు దేవుడిలా కనుపిస్తాడంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం కంగనా రాసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కంగనా తన ఇన్స్టాగ్రామ్ నోట్ లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజీయ్ లీల బన్సాలి గురించి ప్రస్తావిస్తూ.. శ్రీ సంజయ్ లీలా బన్సాలీని ఒక ఆర్టిస్ట్‌గా నేను ఎంతో ఆరాధిస్తాను, గౌవవిస్తాను. అతను ఎప్పుడూ నకిలీగా ఉండరు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వారిలో ఎంతో నిజాయితీగా ఉండే వ్యక్తి ఆయన. అంత నిజాయితీగా ఉండే వ్యక్తులను నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమా అంటే ఆయనకు పిచ్చి. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. అతనొక లివింగ్ లెజెండ్. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు  సంజీయ్ లీల బన్సాలి ప్రొడక్షన్ నుండి ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఎప్పుడైనా కలవాలనుకుంటే ఆయన ఇంటికి వెళ్తాను. అప్పుడు ఆయన నాకు సజీవంగా ఉన్న దేవుడిలా కనిపిస్తారు. ఆయన తన కళ్లతోనే ప్రశంసలు కురిపిస్తారు. ఆయననొక అద్భుతం. అంటూ రాసుకొచ్చారు కంగనా.