
- శంకరాచార్యపై కంగన ఫైర్
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణిస్తూ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. నాయకులు రాజకీయాలు చేయకుండా గోల్ గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. అవిముక్తేశ్వరానంద ఇటీవల ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..“ఉద్ధవ్ కు కొందరు ద్రోహం చేశారని ప్రజలు బాధ పడుతున్నారు. ఠాక్రేను మోసం చేసిన వారిపై ప్రజా వ్యతిరేకత లోక్‌సభ ఎన్నికల్లో కనిపించింది. ఉద్ధవ్ మళ్లీ సీఎం అయ్యేవరకు ప్రజల బాధ తీరదు’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం షిండేకు మద్దతుగా కంగన ట్వీట్ చేశారు.
‘‘రాజకీయాల్లో పొత్తులు, ఒప్పందాలు, పార్టీల విభజన సాధారణం. రాజ్యాంగ బద్ధం. కాంగ్రెస్ 1907లో చీలిపోయింది. 1971లో మళ్లీ చీలింది. ఈ అంశంపై శంకరా చార్య కామెంట్స్ సరికాదని ఆమె విమర్శించారు.