గచ్చిబౌలిలో విషాద ఘటన.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

గచ్చిబౌలిలో విషాద ఘటన.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కన్నడలో చాలా సీరియల్స్లో నటించిన శోభిత ఆత్మహత్యకు పాల్పడింది. శోభిత కొన్నాళ్లు యాంకరింగ్ కూడా చేసింది.

శోభిత భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. శోభిత భర్త హైదరాబాద్ సిటీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శోభిత వయసు 32 సంవత్సరాలు. ఆత్మహత్యకు కారణం తెలియలేదు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కన్నడలోని పలు సీరియల్స్ లో నటించిన శోభిత మృతిపై కుటుంబ సభ్యులు ఇప్పటికైతే కారణాలు వెల్లడించలేదు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

ALSO READ | అధిక లాభాల ఆశ చూపి తెలుగు హీరోయిన్లని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్...

శోభిత శివన్న సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రాం అకౌంట్ ఉంది. శోభిత శివన్నకు ఇన్స్టాలో 18 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫొటోషూట్స్ ఫొటోలను, ఆమె నటించిన సీరియల్స్ పోస్టర్స్ను శోభిత తన అభిమానులతో పంచుకుంటూ ఉండేది.