ఖరీదైన కారు కొన్న రాకీ భాయ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు

ఖరీదైన కారు కొన్న రాకీ భాయ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు

కన్నడ స్టార్ హీరో యష్(Yash) మరో ఖరీదైన కారును కొన్నాడు. ఆ కారు ముందు తన క్యూట్ ఫ్యామిలితో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు యష్. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

యష్ కొనుగోలు చేసిన ఈ  రేంజ్ రోవర్ విలువ సుమారు రూ. 4 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అందమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు.. లగ్జరీ ఫీల్ ను అందిస్తుందట. ఈ కారణంగానే ఎక్కువ మంది సెలబ్రెటీలు రేంజ్ రోవర్ కొనడానికి ఇష్టపడతారు. 

ఇక ఇప్పటికే యష్ గ్యారేజీలో.. కాస్ట్లీ రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్ బెంజ్, ఆడి క్యూ7, మెర్సిడెస్ జిఎల్‌సి కూపే, బిఎమ్‌డబ్ల్యూ 520 డి వంటి కార్స్ ఉన్నాయి. ఇక తాజాగా ఈ  లిస్టులోకి మరో లగ్జరీ కారు చేరింది.