IND vs AUS Final: అభిమానుల ఆగ్రహం..కుల్దీప్ యాదవ్ ఇంటి ముందు భారీ భద్రత

IND vs AUS Final: అభిమానుల ఆగ్రహం..కుల్దీప్ యాదవ్ ఇంటి ముందు భారీ భద్రత

వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న(నవంబర్ 19)   ఆస్ట్రేలియాతో జరిగిన తుది సమరంలో ఆసీస్ జట్టుకు పోటీ ఇవ్వలేక చేతులేత్తేశారు. దీంతో భారత క్రికెటర్లు గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నారు. సొంతగడ్డపై కప్ గెలవలేకపోవడంతో అభిమానులు భారత క్రికెటర్ల అసమర్థ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపంతో అభిమానులు ఆటగాళ్ల ఇంటిపై చేస్తారనే ఉద్దేశ్యంలో పోలీసులు కుల్దీప్ యాదవ్ భద్రతను ఏర్పాటు చేశారు. 

కాన్పూర్‌లోని డిఫెన్స్ కాలనీలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంటి వెలుపల కొంతమంది పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. స్థానిక వార్తా ఛానెల్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో కుల్దీప్ ఇంటి బయట ఇద్దరు పోలీసులు మోహరించినట్లు కనిపించింది. ఒకప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ల్లో ఓడిపోతే ఫ్యాన్స్ ఇంటిపై రాళ్ల దాడి చేసేవారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. దీంతో మన ఆటగాళ్ల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 

ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ చైనామన్ స్పిన్నర్.. ఫైనల్లో మాత్రం ఒక్క వికెట్ తీసుకోలేకపోయాడు. కుల్దీప్ 2023 లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఇది రెండవసారి మాత్రమే. 10 ఓవర్లలో వికెట్లేమీ తీసుకోకుండా 56 పరుగులిచ్చాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కుల్దీప్ ఆసీస్ బ్యాటర్లను ఇబంది పెట్టడంలో విఫలమయ్యాడు. ఓవరాల్ గా 11 మ్యాచ్‌లలో 28.27 సగటుతో 15 వికెట్లు తీసుకున్నాడు.  

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ ఫైనల్లో 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్(137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) 192 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్ ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది.