‘కాంతార’ పార్ట్‌‌ 2కి ప్లాన్ రెడీ

‘కాంతార’ పార్ట్‌‌ 2కి ప్లాన్ రెడీ

‘కాంతార’ మూవీ ఎలాంటి ఎక్స్‌‌పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా విడుదలై కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బ్లాక్‌‌ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో రిషబ్ శెట్టికి ప్యాన్‌‌ ఇండియా వైడ్‌‌గా గుర్తింపు వచ్చింది. దీంతో మేకర్స్ పార్ట్‌‌2కి ప్లాన్ చేసినట్టు తెలిసింది. రిషబ్ ‘కాంతార’ ప్రీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.

అయితే రీసెంట్‌‌ ఒ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. జూన్‌‌లో షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారట. ఈ సినిమా షూటింగ్ స్పాట్స్ కోసం కర్ణాటకలోని సముద్రతీర ప్రాంతాల్లో రిషబ్ శెట్టి తిరుగుతున్నాడట. రెండు నెలలపాటు అక్కడి సంప్రదాయాల గురించి తెలుసుకునే పనిలో ఉన్నాడట. అంతేకాదు.. మొదటి పార్ట్‌‌ను మించేలా భారీ బడ్జెట్‌‌తో సెకెండ్ పార్ట్‌‌ను రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.