
బక్రీద్ సందర్భంగా సోమవారం వేలాది మంది ముస్లింలు నమాజ్ కోసం అయోధ్యలో రోడ్లు మీదకొచ్చారు. అదే టైంలో వందలాది మంది శివభక్తులు కన్వారి యాస్ (శివభక్తుల యాత్ర) గంగకు బయల్దేరారు.అయితే ముస్లింల ప్రార్థనలు టైం తో ముడిపడి ఉండటంతో గంటపాటు యాత్రను వాయిదా వేసుకున్నారు. ప్రార్థనల కోసం వచ్చిన ముస్లింలకు శివభక్తులు ఈద్‌శుభాకాం క్షలు తెలపగా ముస్లింలు ‘హరహర మహాదేవ్ ’ అంటూ గ్రీటిం గ్స్ చెప్పారు. గతంలోనూ చాలాసార్లు ముస్లింల ప్రార్థనలప్పుడు హిందువులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నా రు. ఏటా శ్రావణమాసం చివరి సోమవారం గంగలో స్నానం చేసి శివుడిని దర్శించుకునేందుకు శివభక్తులు భారీగా తరలివస్తారు.