సర్పై సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు..రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్

సర్పై సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు..రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్

న్యూఢిల్లీ: స్పెషల్‌‌‌‌ ఇంటెన్సివ్‌‌‌‌ రివిజన్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌)కు సంబంధించి చీఫ్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ (సీఈసీ) జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌‌‌‌ సిబల్‌‌‌‌ ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని, ఇటీవలి ఎన్నికలను రద్దు చేసే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఎన్నికల సంఘంలోని మిగతా కమిషనర్లు సుఖ్‌‌‌‌బీర్‌‌‌‌ సింగ్‌‌‌‌ సంధు, వివేక్‌‌‌‌ జోషి.. తమకు తెలియకుండానే నిర్ణయాలు, ఆదేశాలపై గత పది నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికను సిబల్‌‌‌‌ ప్రస్తావించారు. 

ఈసీ సమావేశాల్లో ముందస్తు ఎజెండాలు, మినిట్స్‌‌‌‌ లేకపోవడంతో ఇతర కమిషనర్లకు నిర్ణయాలను సమీక్షించే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులను ఈసీఐ నెట్‌‌‌‌ ద్వారా కేంద్రీకరించారని, దీనిని నిర్వహించిన సీమా ఖన్నాపై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఫారం-6లో తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మ వివరాలు చేర్చే మార్పులకు అవసరమైన నోటిఫికేషన్‌‌‌‌ జారీ కాలేదన్నారు.