Devara North Rights: హిందీ దేవర థియేట్రికల్ రైట్స్ను దక్కించుకున్న రెండు దిగ్గజ ప్రొడక్షన్ హౌస్‍లు

Devara North Rights: హిందీ దేవర థియేట్రికల్ రైట్స్ను దక్కించుకున్న రెండు దిగ్గజ ప్రొడక్షన్ హౌస్‍లు

జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్  వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.భారీ బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ రానున్న ఈ సినిమాపై సౌత్ తో పాటు నార్త్ లోను భారీ హైప్ ఉంది. దీంతో ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ను రెండు దిగ్గజ ప్రొడక్షన్ హౌస్‍లు సొంతం చేసుకున్నాయి.

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్(Dharma Productions)అండ్ అనిత్ తందానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్(AA Films) సొంతం చేసుకున్నట్లు మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 10న) అధికారంగా వెల్లడించింది.“దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం దేశంలో డైనమిక్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న కరణ్ జోహార్, ఏఏ ఫిల్మ్స్ సంస్థలతో కలవడం చాలా సంతోషంగా ఉంది.అక్టోబర్ 10న అద్భుత రిలీజ్ కోసం వేచిచూస్తున్నాం” అని దేవర టీమ్ ట్వీట్ చేసింది.

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థకి ఓనర్ అనే విషయం తెలిసిందే.గతంలో ఈ బ్యానర్ నుంచి ప్రభాస్ బాహుబలి నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చి అక్కడ భారీ సక్సెస్ ను అందుకుంది.దీంతో దేవర కూడా అంతకుమించిన విజయాన్ని అందుకుబోతుందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.   

స్టార్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న దేవరలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‍గా నటిస్తుండగా..ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్‍ చాకో, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే దేవర పార్ట్-1కు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. యువసుధ క్రియేషన్స్(Yuvasuda creations) అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవర సినిమా 2024 అక్టోబర్ 10న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ దేవర రిలీజ్ కానుంది. అసలు ఏప్రిల్‍లోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఏకంగా అక్టోబర్‌కు వెళ్లింది. ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా  వస్తున్న విషయం తెలిసిందే.

  • Beta
Beta feature