Goud Saab Movie: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ..డైరెక్టర్‌గా టాలీవుడ్ స్టార్ డాన్స్ మాస్టర్ 

Goud Saab Movie: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ..డైరెక్టర్‌గా టాలీవుడ్ స్టార్ డాన్స్ మాస్టర్ 

సినిమా అనేది వారధి. ఎందుకంటే, అది ఒక్కరికీ దారిని చూపిస్తే మరికొంత మందికి మార్గ నిర్దేశం అవుతుంది. సినిమా అనేది ప్యాషన్ అని చెప్పుకోవడం కంటే, 'భరోసా..ప్రయత్నం' అని చెప్పుకోవొచ్చు.వారధి లాంటి సినిమా రంగంలోకి సోలోగా వచ్చి సక్సెస్ అయిన స్టార్స్ ఎంతో మంది ఉన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూ.ఎన్టీఆర్ వరకు నందమూరి హీరోలు ఉంటే..మెగాస్టార్ చిరంజీవి వచ్చి మెగా వారసులు..అక్కినేని నాగేశ్వరరావు నుంచి  అఖిల్ వరకు.ఇపుడు ఇదంతా ఎందుకంటే..రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు.ఇక ఇదే రెబల్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. 

మరి రెబల్ లెగసీని ప్రభాస్‌తో పాటు కంటిన్యూ చేయబోతున్న హీరో ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నారా? అతడే ‘విరాట్ రాజ్’.ప్రభాస్‌కు కజిన్ అయిన విరాట్ రాజ్ ఇపుడు హీరోగా పరిచయం అవుతున్నారు.తాజాగా విరాట్ పరిచయం అవుతున్న సినిమా ఓపెనింగ్  ఇవాళ (ఏప్రిల్ 10న) ఘనంగా జరిగింది.

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డాన్స్ మాస్టర్ అయిన ‘గణేష్ మాస్టర్’(Ganesh Master)డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ పాల్గొని టైటిల్‌ను ఆవిష్కరించారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ పరిచయం అవుతున్న సినిమాకు ‘గౌడ్ సాబ్’(Goud Saab)అనే టైటిల్ను కన్ఫమ్ చేశారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్టెప్పులేపించిన గణేష్ మాస్టర్ డైరెక్టర్ గా మారుతుండటంతో అల్ ది బెస్ట్ చెప్తున్నారు రెబల్ ఫ్యాన్స్.

ఆర్‌ఎం స్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్న ఈ సినిమాకు లిరిక్ రైటర్ వెంగీ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేయనున్నట్లు గణేష్ ప్లాన్ చేస్తున్నాడు.