
న్యూఢిల్లీ: షాట్ పుటర్ కరణ్‌వీర్, డిస్కస్ త్రోయర్ కిర్పాల్‌పై నాలుగేళ్ల నిషేధాన్ని నాడా అప్పీల్ ప్యానెల్ రెండేళ్లకు తగ్గించింది. దీంతో మరో రెండు నెలల్లో వాళ్లు పోటీపడేందుకు అర్హత సాధించనున్నారు. 2023 ఫెడరేషన్ కప్‌లో బ్రాంజ్ గెలిచిన తర్వాత కరణ్‌వీర్ మెథాండోనిన్, సార్మ్స్ ఎనోబోసార్మ్ తీసుకోవడం వల్ల పాజిటివ్‌గా తేలాడు. కిర్పాల్ డోపింగ్ టెస్టులో స్టానోజోలోల్‌తో పట్టుబడ్డాడు.
దీంతో ఈ ఇద్దరిపై నాలుగేళ్ల నిషేధం పడటంతో నాడా అప్పీల్ ప్యానెల్‌కు వెళ్లారు. ‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నాడా యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. జులై 26, 2023 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. కాబట్టి జులైతో ఇది ముగుస్తుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ పోటీలకు అందుబాటులో ఉంటారు’ అని నాడా పేర్కొంది