కరీంనగర్ లో జోడు పదవుల నేత జోరు

కరీంనగర్ లో జోడు పదవుల నేత జోరు

కరీంనగర్ లో జోడు పదవులు అనుభవిస్తున్న ఓ సీనియర్​ లీడర్ వ్యవహారం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఎన్నికల వేళ ఆయన చేస్తున్న ప్రకటనలు చూసి సొంత పార్టీ కార్యకర్తలే విస్తుపోతున్నారు. ఆయన కామెంట్స్​ పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తున్నాయంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కరీంనగర్ సిటీలో గతంలో పెద్ద పదవి అనుభవించిన ఆ లీడర్​.. రెండేళ్ల క్రితం స్థానిక నేతలతో పొసగక బీఆర్ఎస్ లోనే రెబల్ అవతారమెత్తి తానే ‘కింగ్’నంటూ పార్టీ అధినేతపైనే నిరసన గళం విప్పారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి సైలెంటయ్యారు.

Alsoread:  బీజేపీవన్నీ దృష్టి మళ్లించే చర్యలే : పవన్‌‌ ఖేరా

ఈ క్రమంలోనే  కరీంనగర్ లో ఒక పదవితోపాటు రాష్ట్ర స్థాయిలో మరో నామినేటెడ్ పదవి చిక్కించుకున్నారు.  ప్రస్తుతం ఈ జోడు పదవులు అనుభవిస్తున్న ఆయనకు జిల్లా మంత్రి గంగులతో అస్సలు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల గంగుల ఎన్నిక కేసు విషయంలోనూ సదరు నేత చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారితీశాయి. ఇక ఆ నేత తన పదవి పరిధిలోకి వచ్చే వ్యాపార సంస్థలపై దాడులు చేయిస్తుండడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. వచ్చే ఎన్నికల్లో సదరు నేత పార్టీ గెలుపు కోసం పని చేస్తారా? లేదా అన్న దానిపైనా పార్టీ శ్రేణుల్లోఅనుమానాలున్నాయి.
‑ కరీంనగర్, వెలుగు