కరీంనగర్: ఇంటర్ స్టేట్ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్ అభినందన

కరీంనగర్: ఇంటర్ స్టేట్ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్ అభినందన

రామడుగు/కరీంనగర్ టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీసీ విభాగంలో స్టేట్ ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లా రామడుగు మోడల్ స్కూల్ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ కడారి రశ్మితను కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం అభినందించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లోని తన ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో రశ్మితను సత్కరించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతోనే 470 మార్కులకు  469 మార్కులు సాధించిందన్నారు. 

కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఈవో ప్రశాంత్​రెడ్డి, కో ఆర్డినేటర్ అశోక్​రెడ్డి, రామడుగు సర్పంచ్ మోయిజ్, స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, టీచర్లు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో 256 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే  పరిష్కరించాలన్నారు.