
కరీంనగర్: కరీంనగర్ లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగంలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఓ సమావేశాని హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వర్గాన్ని అవమానించే విధంగా, విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారని అతనిపై ఫిర్యాదు చేశారు కరీంనగర్ జిల్లా బీజేపీ జిల్లా బాస సత్యనారాయణ.
అతని ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ డిపార్ట్ మెంట్ అక్బరుద్దీన్ ప్రసంగించిన వీడియో ను రికార్డ్ చేస న్యాయనిపుణులకు పంపారు. ఆ ప్రసంగం లోని ప్రతి పదాన్ని,వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయ నిపుణులు అందులో ఎటువంటి విద్వేషపూరిత వాఖ్యలు గాని,రె చ్చగొట్టే వాఖ్యలు లేవని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం మీద ఎలాంటి కేసులు నమోదు చేసేందుకు అవకాశం లేదని సలహా కూడా ఇచ్చారు.
వారి సలహా మేరకు ఈ ప్రసంగం పై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని సీపీ కమలాసన్ రెడ్డి మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు.