కరీంనగర్‌ జిల్లాలో కొత్త కానిస్టేబుళ్లకు టెక్నాలజీపై శిక్షణ

కరీంనగర్‌ జిల్లాలో  కొత్త కానిస్టేబుళ్లకు టెక్నాలజీపై శిక్షణ

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. మంగళవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఐటీ కోర్ ఆఫీసులో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్లు, అప్లికేషన్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయకుమార్, వేణుగోపాల్, ఐటీ కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్  సరిలాల్ పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీపీ తనిఖీ చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐ కోటేశ్వర్ సీపీకి స్వాగతం పలకగా సాయుధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు. విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో  ఎస్సైలు భాస్కర్ రెడ్డి, రాజన్న , సుమన్ , శేఖర్   పాల్గొన్నారు.

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వన మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ గౌస్​ఆలం హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మానవుల మనుగడకు చెట్లు ముఖ్యమైనవన్నారు. అనంతరం విద్యార్థులకు సైబర్ క్రైం,  బాలికల సంరక్షణ అంశాలపై సూచనలు చేశారు. అనంతరం స్కూల్​ చైర్మన్ ఫాతిమారెడ్డి 
సీపీని సత్కరించారు.