కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో .. మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ!.. వివరణ ఇచ్చిన పోలీసులు

కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో .. మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ!.. వివరణ ఇచ్చిన పోలీసులు

కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ఆరోపణలు కలకలం రేపాయి. ఓ దొంగతనం కేసులో మున్సిపల్ మహిళా కార్మికురాలిని  పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో కరీంనగర్ పోలీసులు వివరణ ఇచ్చారు.వివరాల్లోకి వెళితే..  

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సువార్త ఇంట్లో బంగారం పోయిందంటూ తనను తీసుకొచ్చి కొట్టారని లక్ష్మి అనే మున్సిపల్ కార్మికురాలు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో తనను పోలీసులు దారుణంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది. విచారణ పేరుతో మహిళను అని చూడకుండా దారుణంగా కొట్టారని వాపోయింది. పోలీసుల దెబ్బలకు చేతులపై అయిన గాయాలను, వాపులను మీడియాకు చూపించింది.  దొంగతనం కేసు ఒప్పుకోవాలని  తీవ్రంగా కొట్టారని కన్నీటి పర్యంతం అయింది బాధితురాలు లక్ష్మీ. వీడియో వైరల్ కావడంతో కరీంనగర్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కరీంనగర్ టూటౌన్ పోలీసులు వివరణ ఇచ్చారు. థర్డ్ డిగ్రీ జరగలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది పోలీసు శాఖ. 

ఈ  వీడియో  వైరల్ కావడంతో  కరీంనగర్ మున్సిపల్ కార్మికురాలి వ్యవహారంలో పోలీసుల వివరణ ఇచ్చారు. .మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే వార్తల్లో నిజం లేదంటూ పోలీసులు  చెప్పారు.నగలు పోయాయనే ఫిర్యాదుపై లక్ష్మిని కేవలం విచారించామని చెప్పారు. పోలీసులు తనను కొట్టలేదు, తిట్టలేదని అదే మహిళ తమకు మళ్లీ  స్టేట్‌మెంట్ ఇచ్చిందని తెలిపిన పోలీసులు. భయంతోనే సోషల్ మీడియా వారికి  పోలీసులపై తప్పుడు సమాచారం ఇచ్చానని లక్ష్మీ చెబుతోందంటున్నారు పోలీసులు.  మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో  పోయిన బంగారం దొరికిందని.. ఆమె కంప్లైంట్ వెనక్కి తీసుకుంటామన్నారని తెలిపారు. సోషల్ మీడియా, పత్రికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ కరీంనగర్ పోలీసులు చెప్పారు.