ఎంపీ బండి సంజయ్‌ వ్యవహారంపై కేంద్రం ఆరా

ఎంపీ బండి సంజయ్‌ వ్యవహారంపై కేంద్రం ఆరా

ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. కరీంనగర్ లో ఆర్టీసీ డ్రైవర్‌ నగునూరి బాబు అంతిమయాత్ర ఉద్రిక్తంగా సాగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో  కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో పోలీసులు హైడ్రామాకు తెరతీశారు. బాబు పనిచేసిన కరీంనగర్​ 2 డిపోకు మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబసభ్యులకు మొదట హామీ ఇచ్చి, తర్వాత ఒక వ్యూహం ప్రకారం దారి మళ్లించారు.  ఈ క్రమంలో రోప్​వేను తోసుకెళ్లిన ఆందోళనకారులపై పోలీసులు చేయిచేసుకున్నారు. ఓ పోలీస్​ ఉన్నతాధికారి ఎంపీ బండి సంజయ్​ గల్లా పట్టి లాగడం, చెవిపట్టి లాగడం వివాదాస్పదమైంది.  పోలీసుల తీరుపై పెద్ద ఎత్తన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్ట్, తీర్పు, బండిసంజయ్ పై వ్యవహరించిన తీరుపై కేంద్రం ఆరా తీసింది. తక్షణమే ఢిల్లీకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు పిలుపునిచ్చింది.  హైకమాండ్ పిలుపుతో లక్ష్మణ్ ఢిల్లీ వెళనున్నారు. లక్ష్మణ్ ఢిల్లీ పర్యటన కు ముందే ఆర్టీసీ జేఏసీ నేత ఆశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు ఆయనను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.