మున్సిపాలిటీలకు కాసుల పంట

మున్సిపాలిటీలకు కాసుల పంట
  •     90 శాతం వడ్డీ మాఫీతో వసూలైన మొండి బకాయిలు
  •     ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో సిరిసిల్ల ఫస్ట్, జహీరాబాద్ లాస్ట్
  •     కార్పొరేషన్లలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్, వెలుగు :  మొండి బకాయిదారుల నుంచి ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన స్కీమ్‌‌‌‌‌‌‌‌తో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఖజనాలో కోట్ల రూపాయలు జమయ్యాయి. వడ్డీపై 90 శాతం మాఫీ చేయడంతో ఏళ్ల తరబడి ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టని సంస్థల యజమానులు పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మినహా రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం రూ.1300.07 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా, మార్చి 31 నాటికి రూ.922.03 కోట్లు (70.92 శాతం) వసూలయ్యాయి. మరో రూ.378 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 19 మున్సిపాలిటీల్లో 90 శాతానికి పన్ను వసూలు కాగా ఇందులో 8 మున్సిపాలిటీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే కావడం విశేషం. 

ట్యాక్స్ చెల్లింపుల్లో సిరిసిల్ల ఫస్ట్‌‌‌‌‌‌‌‌

ఫిబ్రవరి నెలాఖరు వరకు సగం కూడా వసూలు కాని ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ గత నెల రోజుల్లోనే టార్గెట్‌‌‌‌‌‌‌‌కు చేరువ అయింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ.5.61 కోట్లు బకాయి ఉండగా రూ.5.58 కోట్ల వసూలై 99.52 శాతం వసూళ్లతో రాష్ట్రంలోనే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. రూ.1.94 కోట్లకుగానూ రూ.1.88 కోట్లు వసూలై 96.84 శాతంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ రెండో స్థానంలో నిలిచింది. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో రూ.2.40 కోట్ల వసూళ్ల (95.80)తో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, రూ.1.39 కోట్ల (95.51 శాతం) వసూళ్లతో జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ, రూ.2.24 కోట్లతో నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ తర్వాతి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా జిల్లా నర్సాపూర్‌‌‌‌‌‌‌‌ (రూ.3.17 కోట్లకు 3.02 కోట్లు వసూలు), కరీంనగర్ జిల్లా జమ్మికుంట(రూ.3.05 కోట్లకు 2.90 కోట్లు), గద్వాల జిల్లా వడ్డేపల్లి (రూ.89 లక్షలకు రూ. 85 లక్షలు), పెద్దపల్లి (రూ.4.25 కోట్లకు 3.99 కోట్లు), జగిత్యాల జిల్లా కోరుట్ల (రూ.4.27 కోట్లకు రూ. 3.99 కోట్లు) మున్సిపాలిటీలు నిలిచాయి. 

చివరి స్థానాల్లో జహీరాబాద్, నల్గొండ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ.16.70 కోట్ల ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూలు కావాల్సి ఉండగా రూ.5.81 కోట్లు (34.77 శాతం) మాత్రమే వసూలయ్యాయి. దీంతో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూలైన మున్సిపాలిటీగా జహీరాబాద్ నిలిచింది. అలాగే రూ. 44.53 కోట్లకుగానూ రూ.18.32 కోట్ల(41.14 శాతం) వసూళ్లతో నల్గొండ మున్సిపాలిటీ చివరి నుంచి రెండో స్థానంలో, రూ.2.66 కోట్ల వసూళ్లతో నకిరేకల్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ చివరి నుంచి మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాలపల్లి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వికారాబాద్ జిల్లా తాండూరు, నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా బైంసా మున్సిపాలిటీల్లో సగానికి కన్నా తక్కువ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూలైంది.

కార్పొరేషన్లలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ టాప్ 

అత్యధికంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైన కార్పొరేషన్లలో కరీంనగర్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. ఇక్కడ రూ.34.83 కోట్లకుగానూ 91.24 శాతంతో రూ.31.78 కోట్లు వసూలు అయ్యాయి. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌లో రూ.88 కోట్లకు రూ.71.08 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో రూ.8.37 కోట్లు, ఫిర్జాదిగూడలో రూ.16.98 కోట్లు, నిజాంపేటలో రూ. 53.63 కోట్లు, బండ్లగూడ జాగీర్‌‌‌‌‌‌‌‌లో రూ.20.24 కోట్లు, బడంగ్‌‌‌‌‌‌‌‌పేటలో రూ.18.83 కోట్లు, బోడుప్పల్‌‌‌‌‌‌‌‌లో రూ.15.45 కోట్లు వసూలయ్యాయి.