రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్

రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అయితే మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని  ఓ ఆర్టీసీ బస్సులో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ, ఆమె మనవరాలు బెంగళూరు  నుంచి మైసూరుకు ప్రయాణిస్తున్నారు. వారితోపాటు నాలుగు చిలుకలు కూడా తీసుకెళ్తున్నారు. KSRTC బస్సు కండక్టర్ ఆ చిలుకలను రూ.444 లు బస్సు ఛార్జీ టికెట్ కొట్టాడు. వారికి మాత్రం శక్తి యోజన స్కీం కింద ఫ్రీ టికెట్ తీశాడు. ఈ టాపింగ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఆ టికెట్, రామచిలుకలు ఉన్న ఫొటో చూసిన వారందరూ షేర్ చేసుకుంటున్నారు. 

కర్ణాటక ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్‪పోర్ట్‌లో  పెంపుడు జంతువులకు అనుమతిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి పెట్ ఆనియల్స్ ను బస్సులోని తీసుకురానివ్వరు. కర్ణాటక రాష్ట్రంలో వైభవ, రాజహంస, నాన్ ఏసీ, స్లీపర్, ఏసీ బస్సుల్లో పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లనివ్వరు. మిగిలిన బస్సుల్లో పెంపుడు జంతువులకు అనుమతి ఉంటుంది. పెంపుడు కుక్కలకు పెద్దల ఛార్జీలో హాఫ్ టికెట్, కుందేళ్లు, పక్షులు, పిల్లులకు మాత్రం చిన్న పిల్లలకు తీసుకునే హాఫ్ టికెట్‌లో సగం ఛార్జీ చెల్లించాలి. పెట్ ఆనిమల్స్ కు టికెట్ కొట్టకుంటే.. నిధుల దుర్వినియోగం చేసినట్లు పరిగణించి కండక్టర్ పై క్రిమినిల్ కేసు నమోదు చేస్తారు. డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. టికెట్ తీయని యజమానులకు టికెట్ ధరలో 10శాతం ఫైన్ విధిస్తారు. దీంతో రామ చిలుకలతో 444 రూపాయల టికెట్ కొట్టాడు కండక్టర్.