కన్నడలోనూ పోటీ పరీక్షలు నిర్వహించాలె: కర్నాటక సీఎం సిద్ధరామయ్య

కన్నడలోనూ పోటీ పరీక్షలు నిర్వహించాలె: కర్నాటక సీఎం సిద్ధరామయ్య
  • త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తా: సిద్ధరామయ్య

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలను కన్నడ భాషలోనూ నిర్వహించాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్​ చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. కేంద్రం.. హిందీ, ఇంగ్లిష్‌‌ భాషల్లో మాత్రమే పరీక్షలను నిర్వహిస్తోందని, దానిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 68వ కర్నాటక రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఆయన ప్రజలనుద్దేశించి సిద్ధరామయ్య మాట్లాడారు. "మా పిల్లలు వారికి తెలిసిన భాషలోనే పరీక్షలు రాస్తారు. ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా మా ప్రధానమంత్రిని అభ్యర్థిస్తాను" అని ఆయన అన్నారు.

 ప్రభుత్వ పాఠశాలల్లోనే కన్నడ బోధనా మాధ్యమంగా ఉందని, ప్రయివేటు పాఠశాలల్లో లేదని చెప్పారు. ప్రైవేటులో ఇంగ్లిషు మీడియంలో చదివేవారే ప్రతిభావం తులని, మంచి ఉద్యోగం సాధిస్తారనే అపోహ ప్రజల్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు నచ్చిన మీడియంలో చదివించే హక్కు తల్లిదండ్రులకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది.."  అని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటకలో 10వ తరగతి వరకు కన్నడ భాషను తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.