బీఆర్ఎస్ లీడర్లవి తప్పుడు ప్రచారం: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

బీఆర్ఎస్ లీడర్లవి తప్పుడు ప్రచారం: కర్ణాటక సీఎం సిద్దరామయ్య
  • కర్నాటకలో ఐదు గ్యారెంటీలు చేస్తున్నం 
  • ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య 

హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదన్న బీఆర్ఎస్ కామెంట్లపై ఆరాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. తాజ్కృష్ణలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మా రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నరు. కావాలంటే బీఆర్ఎస్ నేతలు కర్ణాటకకు వచ్చిన ఐదు గ్యారెంటీలు అమలు అవుతున్నాయో లేదో చూడొచ్చు అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సూచించారు.