అన్ని వర్గాలకోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

అన్ని వర్గాలకోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్: కర్ణాటక సీఎం సిద్దరామయ్య

పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశాడు.. దేశంలో అన్ని వర్గాలు, కుల, మతాల ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్ లింగంపల్లిలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు సిద్దరామయ్య. బీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీల వైఖరి ఒక్కటేనని.. పేదలపై పన్నులు వేసి.. బడాబాబులకు రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు.

పదేళ్లలో సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, రైతులు, యువతకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు సిద్దరామయ్య. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల  చేశారని.. తెలంగాణ వచ్చినప్పుడు 75వేల కోట్ల అప్పులుంటే.. పదేళ్లలో 5లక్షల 30 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. 

కర్ణాటకలో తాము అమలు చేస్తునన గ్యారంటీలపై సీఎం కేసీఆర్, కేటీఆర్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గ్యారంటీలు అమలు అవుతున్నాయి లేదా కర్ణాటకు వచ్చి చూడమని కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్ విసురుతున్నా.. కానీ వాళ్లకు కర్ణాటక కు వచ్చే ధైర్యం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని సిద్దరామయ్య స్పష్టం చేశారు.