రామేశ్వరం కేఫ్ను పరిశీలించిన సీఎం సిద్ధరామయ్య

రామేశ్వరం కేఫ్ను పరిశీలించిన సీఎం సిద్ధరామయ్య

బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ జరిగిన రామేశ్వరం కేఫ్ ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సందర్శించారు. పోలీసులు,అధికారులతో కలిసి పరిశీలించారు. బ్లాస్టింగ్ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై స్పందించిన సిద్దరామయ్య..  అనవసరంగా రాజకీయం చేయొద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సహకరించాలని కోరారు. ఎవరో ఒక వ్యక్తి మాస్క్, క్యాప్  వేసుకుని కేఫ్ కు వచ్చినట్లు చెప్పారు. తన వెంట తెచ్చుకున్న  బ్యాగ్ ను కేఫ్ లో ఓ మూలన వదిలేసి..టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడని చెప్పారు. అతనెవరో తెల్వదని..నిందితుడిని త్వరగా పట్టుకుంటామని తెలిపారు. 

దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు ఇవాళ(మార్చి 2) ఉదయం రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్ తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకొని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. సదరు వ్యక్తి ఇడ్లి ప్లేట్ తో కేఫ్ లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు.