అంబానీ పెళ్లి వేడుకలో.. అతిధులకు ప్రత్యేక గుడారాలు

అంబానీ పెళ్లి వేడుకలో.. అతిధులకు ప్రత్యేక గుడారాలు

అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ వేడుకకు అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నారు.ఈ క్రమంలో ప్రముఖ బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేడుక వచ్చిన గెస్ట్ ల కోసం ఏర్పాటు చేసిన టెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ టెంట్స్ లో సైనా డాన్స్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

అతిధుల కోసం ఏర్పాటు చేసిన ఈ టెంట్స్ బెడ్ రూమ్, లాంజ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా, డ్రెస్సింగ్ ఏరియా సోఫా, టీవీ, ఏసీలతో విలాసవంతంగా ఉన్నాయి. జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకకు బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, దీపికా పదుకొనె, రన్బీర్ కపూర్, అలియా భట్, సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోని తదితరులు హాజరయ్యారు.