కర్నాటకలో ఆరెస్సెస్ యాక్టివిటీస్ కు కొత్త రూల్స్..మార్చ్, ఈవెంట్లకు పర్మిషన్ తప్పనిసరి

కర్నాటకలో ఆరెస్సెస్ యాక్టివిటీస్ కు కొత్త రూల్స్..మార్చ్, ఈవెంట్లకు పర్మిషన్ తప్పనిసరి
  • మార్చ్, ఈవెంట్లకు పర్మిషన్​తప్పనిసరి చేసిన ప్రభుత్వం
  •  ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రియాంక్​ ఖర్గే లేఖలతో చర్యలు 

బెంగళూరు: ఆరెస్సెస్​ యాక్టివిటీస్ ను నియంత్రించేందుకు కొత్త నిబంధనలు తీసురావాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు, పబ్లిక్ ప్లేసులు, గవర్నమెంట్ ప్రాంగణాల్లో ఆ సంస్థ మార్చ్, ఈవెంట్స్ నిర్వహించాలంటే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఆరెస్సెస్​ లేదా మరే సంస్థ అయినా  డిస్ట్రబెన్స్​ కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే నియంత్రిస్తామని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఆరెస్సెస్​ యాక్టివిటీస్​పై తెచ్చిన నిబంధనలు పరిశీలించి, వాటిని అనుసరించాలని కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీశ్​కు ఆదేశాలు జారీ చేశారు. ఆరెస్సెస్​ యాక్టివిటీస్​పై ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఎన్ని బెదిరింపులు వచ్చినా యువతను తీవ్రవాదం  నుంచి రక్షిస్తామని ప్రియాంక్ అన్నారు. 

ప్రియాంక్​కు బెదిరింపులు

ఆరెస్సెస్ శాఖలు ప్రభుత్వ బడులు, పబ్లిక్ గ్రౌండ్స్​లో నడుస్తున్నాయని, అవి యువత మనస్సుల్లో విషం నింపుతున్నాయని, ఇది దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నదని కర్నాటక మంత్రి ప్రియాంక్​ ఖర్గే అక్టోబర్​4న సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. తమిళనాడులో అమలు చేస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ క్యాకలాపాలను నియంత్రించాలని అందులో కోరారు.