బెంగళూరు: కర్నాటకలోని కలబుర్గి జిల్లా అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఓట్చోరీపై విచారణకు ఆదేశించాలని ఎలక్షన్ కమిషన్(ఈసీ)ను కర్నాటక మంత్రి ఎంబీ పాటిల్ కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అలంద్‌లో 6 వేలకు పైగా ఓట్లను తొలగించేందుకు కుట్ర జరిగినట్లు సీట్ దర్యాప్తులో తేలిన తర్వాత శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓట్ చోరీ చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెప్తున్నది ఇప్పుడు రుజువైందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఓట్ చోరీ జరిగి ఉండొచ్చు. ఇప్పటికైనా బీజేపీ చేసిన పాపాలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై ఈసీ దర్యాప్తు చేపట్టాలి”అని పాటిల్ అన్నారు.
