- కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఘటన
బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోషల్ వెల్ఫేర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లి కార్జున్ కార్యాలయంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పావగడలోని అప్పా బండే ప్రాంతంలో ఉన్న కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఆత్మహత్యకు ముందు సహచరులకు పంపిన వీడియోలో, అదే శాఖలో జిల్లా డైరెక్టర్ కృష్ణప్ప వేధింపుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని మల్లికార్జున్ పేర్కొన్నారు. తన కుటుంబం ఎంతో ప్రేమగా చూసుకుం దని, వారికి మరింత సహాయం చేయాల నుకున్నానని కానీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవద్ద ని కుటుంబ సభ్యులకు సూచిస్తూ, దేవుడూ చట్టమే శిక్షిస్తాయని తెలిపారు. ఈ ఘటనపై పావగడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.
