పి.బి.యన్ స్క్వేర్ లో కర్ణిక జ్యూయల్స్

పి.బి.యన్ స్క్వేర్ లో కర్ణిక జ్యూయల్స్

హైదరాబాద్​, వెలుగు: సిటీలోని జూబ్లీహిల్స్  రోడ్ 36లోగల పి.బి.యన్ స్క్వేర్ లో ఏర్పాటైన కర్ణిక జ్యూయల్స్​ను టాలీవుడ్‌‌‌‌ నటి,  బిగ్ బాస్‌ ఫేమ్ హిమజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాషన్ కు తగ్గ నగలతో అందం మరింత పెరుగుతుందని అన్నారు. సిల్వర్ , గోల్డ్ ప్లేటెడ్ నగలకు ఆదరణ పెరుగుతున్నదని అన్నారు.

కర్ణిక జ్యూవెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి మాట్లాడుతూ  తాము అన్ని రకాల లేటెస్ట్​ గోల్డ్​, సిల్వర్​ నగలను అమ్ముతామని చెప్పారు.  తప్పా, ఫ్యూషన్,  నక్షి, నవరతన్ , స్వరోక్సి వంటి బ్రాండ్ల నగలూ తమ స్టోర్​లో లభిస్తాయని అన్నారు. సిటీలో మరిన్ని స్టోర్లను తెరిచే ఆలోచన ఉందన్నారు.