జూన్ 6న ఖైరతాబాద్ మహాగణపతి కర్ర పూజ

జూన్ 6న ఖైరతాబాద్ మహాగణపతి కర్ర పూజ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ బడా గణేశ్​విగ్రహ తయారీకి ప్రతి ఏడాది నిర్వహించే కర్ర పూజకు నిర్వాహకులు ముహూర్తం ఖరారు చేశారు. నిర్జల ఏకాదశి అయిన జూన్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు కర్ర పూజ నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేశ్​ఉత్సవ కమిటీలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. భక్తులు తరలి రావాలని కోరారు.