కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ మూవీ ‘వా వాతియార్’. కృతిశెట్టి హీరోయిన్. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో డిసెంబర్ 12న విడుదలవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం ఈ చిత్రం నుంచి ‘అలాపిక్కే ఉమ్మక్’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
సంతోష్ నారాయణన్ ట్రెండీ ట్యూన్‌తో సాంగ్ కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించి పాడాడు. -‘వలయ అహ్ కలయ, గోలయ్య, జై బాలయ్య, కలలే వలరా, గురువా నా మాటే వినరా..’ అంటూ సాగిన పాట కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.
