కోస్టల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ‘మార్షల్’.. కార్తి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29వ సినిమా

కోస్టల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ‘మార్షల్’.. కార్తి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29వ సినిమా

‘సర్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌ను ఇటీవల పూర్తి చేసిన కార్తి.. మరోవైపు ‘వా వాతియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే మరో సినిమాను రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ చేస్తున్నాడు. ఇవి రెండు కాక అతను హీరోగా మరో కొత్త చిత్రం మొదలైంది. దీనికి ‘మార్షల్‌‌‌‌‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయించారు. కార్తి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది29వ సినిమా. ‘తానక్కారన్’ ఫేమ్ తమిళ్‌‌‌‌‌‌‌‌ దీనికి దర్శకత్వం వహిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌‌‌‌‌.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్‌‌‌‌‌‌‌‌.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు.

ఇషాన్ సక్సేనా కో ప్రొడ్యూసర్. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ కూడా స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో కార్తికి జంటగా కళ్యాణి ప్రియదర్శన్‌‌‌‌‌‌‌‌ నటిస్తోంది. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి కోస్టల్ విలేజ్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.