నవంబర్ 14 నుంచి అమీర్పేటలో కార్తీక మహోత్సవం

నవంబర్ 14 నుంచి అమీర్పేటలో  కార్తీక మహోత్సవం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: అమీర్ పేట ఎంసీహెచ్​స్టేడియంలో శుక్రవారం నుంచి 16వ తేదీ వరకు కార్తీక మహోత్సవం నిర్వహించనున్నట్లు హైబిజ్​వన్​ఫౌండర్​సంధ్యారాణి తెలిపారు. బుధవారం నిర్వాహకుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. మూడు రోజుల పాటు హోమాలు, వ్రతాలు, అభిషేకాలు ఒకేచోట నిర్వహిస్తామని, కార్యక్రమానికి ప్రజలంతా హాజరు కావాలని కోరారు. అందరికీ ఉచిత ప్రవేశంఉంటుందని చెప్పారు.