కార్తీకమాసం కొనసాగుతోంది. ఈ ఏడాది ( 2025) మరో ( నవంబర్ 17 నాటికి) మూడు రోజులకు ముగుస్తుంది. ఇప్పటికే నాలుగు సోమవారాలు... రెండు ఏకాదశులు పూర్తయ్యాయి. ఇంకా మాసశివరాత్రి... అమావాస్య రోజులు ఎంతో ప్రాముఖ్యమైనవి . పురాణాల ప్రకారం కార్తీకమాసం ప్రతిరోజు చేసే దీపారాధనకు.. పూజలకు చాలా విశిష్టత ఉంది కుటుంబసభ్యుల మధ్య అనవసరంగా మనస్పర్దలు ఏర్పడుతున్నా.. గొడవలు జరుగుతున్నా.. కార్తీకమాసం మాసశివరాత్రి రోజున కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది కార్తీకమాసం మాసశివరాత్రి నవంబర్ 18న వచ్చింది. ఆరోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. . .!
ప్రతినెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్థశి తిథిని మాస శివరాత్రిగా భక్తులు జరుపుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యం ఉంది. కార్తీకమాసంలో వచ్చే మాస శివరాత్రి అత్యంత మహిమాన్వితమైందని భక్తులు భావిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసంలో మాసశివరాత్రి మంగళవారం అంటే.. నవంబర్ 18వ తేదీన వచ్చింది.
కార్తీకమాసం మాసశివరాత్రి రోజున తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని... ఉదయం తులసి కోట దగ్గర ( ఆవునెయ్యుతో) .. ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ( కొబ్బరి నూనెతో)... దేవుని మందిరం దగ్గర ( నువ్వులనూనెతో) దీపారాధన చేయాలి. ఇంట్లో పరమేశ్వరునికి.. కుల దైవానికి పూజలు చేయాలి. తులసిమొక్కకు చందనం.. పసుపు... కుంకుమ సమర్పించాలి. ఆ తరువాత శివాలయానికి వెళ్లి.. ధ్వజస్థంభం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి.. శివలింగానికి అభిషేకంచేయాలి. లేదంటే పండితులు అభిషేకం చేస్తున్నప్పుడు శ్రద్దగా భక్తితో చూస్తున్నా సరిపోతుంది.
కార్తీకమాసం మాసశివరాత్రి ( నవంబర్ 18) రోజు చదవాల్సిన మంత్రాలు..
శ్రీ శివాయ.. మహాదేవాయ.. ఐశ్వర్వేశ్వరాయ నమ: ఐశ్వర్యం.. సంపద కలుగుతుంది..
శ్రీం శివాయ నమ:కుటుంబ గొడవలుపరిష్కారమవుతాయి.
ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుతూ.. శివునికి అభిషేకం : గ్రహ, నక్షత్ర దోషాలు తొలగుతాయి..
ఏ కోరికకు.. ఎలాంటి పరిహారం..
- పరమేశ్వరునికి కార్తీకమాసం మాస శివరాత్రి రోజున ప్రదోషకాలంలో ( సాయంత్రం) అన్నాభిషేకం చేయాలి . నక్షత్ర దర్శనం చేసుకుని.. ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే పరమ శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతారు.
- కార్తీకమాసం మాసశివరాత్రి రోజున పరమేశ్వరునికి దర్భలతో కలిపిన నీటితో .. పంచామృతాలు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, చెరుకు రసం, పంచదార, విభూది జలాలతో అభిషేకం చేసినా మంచిఫలితాలు కలుగుతాయి.
- శత్రుబాధలు తొలగిపోవాలంటే మాత్రం మాస శివరాత్రి రోజు.. ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని చెబుతారు.చాలామందికి వారు తలపెట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు కలుగుతుంటాయి. అవి తొలగిపోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో మహా శివునికి అభిషేకం చేయాలి.
- జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకం చేయాలి
- మహిళలకు దీర్ఘసుమంగళి యోగం కోసం శివలింగంపై రాళ్లఉప్పు ఉంచి నమస్కారం చేయాలని సూచిస్తున్నారు.
- కార్తీక మాసం మాసశివరాత్రిరోజు స్వామిని జిల్లేడు పూలతో పూజిస్తే కుటుంబ కలహాలు తగ్గుతాయి.
- నాగశివలింగ పుష్పాన్ని (సహస్ర ఫణి పువ్వు) శివుని వద్ద ఉంచి నమస్కరించాలని సూచిస్తున్నారు. లేకుంటే జిల్లేడు పూలు, ఎర్ర మందారాలతో ఆయన్ని పూజించాలని చెబుతున్నారు.మాసశివరాత్రి రోజున శివాలయంలో పరమ శివునికి నంది హారతి, నాగ హారతి ఇస్తారు. వీటిని దర్శించుకోవాలని సూచిస్తున్నారు.
- కుటుంబంలో మనశ్శాంతి లభించాలంటే.. కలహాలు తొలగిపోవాలంటే.. కార్తీకమాసం మాసశివరాత్రి ( నవంబర్ 18) రోజు సాయంత్రం కొబ్బరినూనెతో దీపం వెలిగించాలి.
- శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.
- శక్తిమేరకు పేదలకు.. బ్రాహ్మణులకు దానధర్మాలు చేయాలి
