Karuppu OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘కరుప్పు’.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?

Karuppu OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘కరుప్పు’.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?

తమిళ స్టార్ హీరో సూర్య, సౌత్ స్టార్ క్వీన్ త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ కం యాక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో సూర్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.

గత నెల మే 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన కరుప్పు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

కథేంటంటే?

తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు (ఇంద్రన్స్) తన కూతురి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ సిటీకి రాగానే కొందరు దొంగలు వారి దగ్గరున్న నగలను దొంగిలిస్తారు. పోలీసులు దొంగలను పట్టుకున్నప్పటికీ, ఆ నగలను తిరిగి పొందాలంటే నాంపల్లి కోర్టు చుట్టూ తిరగాల్సిందేనని చెబుతారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఆ తండ్రీకూతుళ్లకు బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే ఒక అవినీతి లాయర్ తారసపడతాడు.

సహాయం చేయాల్సింది పోయి, వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడతాడు. పోలీస్, లీగల్ సిస్టమ్‌లోని అవినీతి పరాకాష్టకు చేరిన తరుణంలో.. ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికి, బాధితులకు న్యాయం చేయడానికి సాక్షాత్తూ ఆ 'కరుప్పు' (వీరభద్రుడు) దేవుడు మనుష్య రూపంలో లాయర్ శరవణన్ (సూర్య) గా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ!

థియేటర్ రెస్పాన్స్..

న్యాయవ్యవస్థలోని అవినీతిని అంతం చేసే ఒక పవర్‌ఫుల్ లాయర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఆ లాయర్ ఎవరో కాదు.. సాక్షాత్తూ కలియుగ కాపలా దైవం 'కరుప్పుసామి' మానవరూపం. మంచికి (సూర్య), చెడుకి (ఆర్జే బాలాజీ) మధ్య జరిగే ఈ మోడ్రన్ మైథలాజికల్ వార్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిషల కాంబినేషన్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయగా.. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేసింది. ఆర్జే బాలాజీ విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.