కార్వీపై కేసు నమోదు చేసిన ఈడీ

కార్వీపై కేసు నమోదు చేసిన ఈడీ

హైదరాబాద్, వెలుగు: బ్యాంకుల రుణాల కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌‌‌‌బీఎల్‌‌‌‌)కు చెందిన రూ.110 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) జప్తు చేసింది. చైర్మన్‌‌‌‌ పార్థసారథి సంస్థలకు చెందిన ల్యాండ్స్, బిల్డింగ్స్, షేర్స్, జువెల్లరీ అటాచ్‌‌‌‌ చేసినట్లు ఈడీ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే రూ.1,984 కోట్ల విలులైన ఆస్తులను ఈడీ అటాచ్‌‌‌‌ చేసింది. సెబీ రూల్స్‌‌‌‌కి విరుద్ధంగా డిపాజిటర్ల షేర్లతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వివిధ కార్పొరేటు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న సంగతి తెలిసిందే. కార్వీపై కేసు నమోదు చేసిన ఈడీ.. శనివారం వరకు రూ.2,095 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.