టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్

టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బక్కని నర్సింహులును పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడంతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ నెల 10న బాధ్యతలు స్వీకరించనున్నారు.

మాజీ ఎమ్మెల్సీ అయిన కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కాసాని 2018లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు.