ఇండ్లు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న పండిట్లు

ఇండ్లు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న పండిట్లు

శ్రీనగర్: టెర్రరిస్టులు టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తుండడంతో కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు జమ్మూకాశ్మీర్​ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద జమ్మూకాశ్మీర్​లో ఉద్యోగాలు పొందిన కాశ్మీరీ పండిట్లు కొద్దిరోజులుగా తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. కుల్గాం జిల్లాలో మహిళా టీచర్​ను టెర్రరిస్టులు కాల్చి చంపిన ఘటన నేపథ్యంలో వాళ్లంతా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమను 24 గంటల్లో ఇతర ప్రాంతాలకు తరలించకపోతే తామే లోయను విడిచి వెళ్లిపోతామని మంగళవారం హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పలువురు కాశ్మీరీ పండిట్లు ఇండ్లు ఖాళీ చేసేందుకు ట్రక్కులను మాట్లాడుతున్న సీన్లు బుధవారం కనిపించాయి. భద్రతా చర్యలపై ప్రభుత్వంనుంచి ఏ నిర్ణయం రాకపోతే గురువారం వలసపోక తప్పేలా లేదని 
వాపోయారు.

ఎల్జీకి హోంమంత్రి అమిత్​ షా ఫోన్​​..

కాశ్మీరీ పండిట్ల ఆందోళనలపై కేంద్రం స్పందించింది. ఎల్జీ మనోజ్​ సిన్హాకు హోంమంత్రి అమిత్​ షా ఫోన్​ చేసి మాట్లాడారు. దీనిపై శుక్రవారం ఎల్జీతో సహా ఇతర అధికారులతో రివ్యూ చేయనున్నారు.