IPL 2025: చెన్నై జట్టు నుంచి ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ఔట్.. కన్ఫర్మ్ చేసిన CSK సీఈఓ

IPL 2025: చెన్నై జట్టు నుంచి ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ఔట్.. కన్ఫర్మ్ చేసిన CSK సీఈఓ

ఇండియా, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల సస్పెన్షన్ తర్వాత ఐపీఎల్ 2025 శనివారం (మే 17) ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో జరగబోయే మిగతా మ్యాచ్ లకు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు అందుబాటులో ఉండడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మిగిలిన ఐపీఎల్ సీజన్ కు తమ జట్టులో ఎక్కువ మంది విదీశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదని బుధవారం (మే 14) ధృవీకరించారు. విశ్వనాథన్ ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి సామ్ కర్రన్, జామీ ఓవర్టన్ ఇండియాకు రావడం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది.   

కర్రన్, జామీ ఓవర్టన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు ఆడేందుకు ఆసక్తి చూపించట్లేదట.   దీనికి కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్ మే నెలాఖరులో వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. మే 29 నుంచి జరగబోయే ఈ సిరీస్ కోసం మంగళవారం (మే 13) ఇంగ్లాండ్ వన్డే, టీ20 స్క్వాడ్ ను ప్రకటించారు. రెండు స్క్వాడ్ లో ఓవర్ టన్ స్థానం దక్కించుకున్నాడు. సామ్ కరణ్ ఎంపిక కాకపోయినా అతను ఇండియాకు రావట్లేదట. వీరితో పాటు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉండడం లేదు.        

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో ఈ రెండు జట్లకు ఫారెన్ ప్లేయర్ల అవసరం లేకుండా పోయింది.  లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లాండ్ జట్టులో స్థానం దక్కలేదు. అతను అన్ని ఐపీఎల్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌ మ్యాచ్ లు మే 29 నుండి ప్రారంభమవుతాయి. కానీ అదే రోజున ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కు కెప్టెన్సీ చేయనున్నాడు.   
ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు.. జూన్ 3 న ఫైనల్ జరగనుంది.   

వెస్టిండీస్ తో వన్డేలకు ఇంగ్లాండ్ జట్టు

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, టామ్ హార్ట్లీ, మాథ్యూ పాట్స్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జామీ స్మిత్

వెస్టిండీస్ తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్