పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత.. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

పండిట్  బిర్జూ మహారాజ్ కన్నుమూత.. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషన్ అవార్డ్ గ్రహీత   పండిట్ బిర్జూ మహారాజ్(83) ఇవాళ(సోమవారం) కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు.  1986 లో దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. దేవదాస్, బాజీరావు మస్తానీ, సత్యజిత్ రే చిత్రం చెస్ కే ఖిలాడీ కి సంగీతం అందించారు. 2012 లో వచ్చిన విశ్వరూపం సినిమాకు ఆయనకు జాతీయ చలన చిత్ర పురస్కారం లభించింది. 

పండిట్ బిర్జూ మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. భారతీయ నృత్య రూపాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును అందించిన పండిట్ బిర్జూ మహారాజ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.