సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్​ పిటిషన్

సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్​ పిటిషన్

లిక్కర్​ స్కాంలో అరెస్ట్​ చేసిన కవితను రేపు ( మార్చి 16) న ఢిల్లీ రౌస్​ అవెస్యూ కోర్టులో  11 గంటలకు హాజరుపర్చనున్నారు. ఈ రోజు ( మార్చి 15)సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అరెస్ట్​ చేశారు.  రేపు ( మార్చి 16) కవిత సుప్రీం కోర్టులో  ఛాలెంజ్​ పిటిషన్​ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.  కవితతో భర్త అనిల్​ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 10.30 గంటల ఫ్లైట్​ కు మరికొంత మంది కుటుంబసభ్యులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం ఉంది.   మనీ లాండరింగ్​ కింద సెక్షన్లపై ఈడీ కేసు నమోదు చేసింది.  రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్​ చేశారని కవిత ఆరోపించారు.  న్యాయపరంగా  ఎదుర్కొంటామని కవిత తెలిపింది.