కవితకు ఊరట : ఇంటి భోజనం.. కుటుంబ సభ్యులతో రోజూ మీటింగ్

కవితకు ఊరట : ఇంటి భోజనం.. కుటుంబ సభ్యులతో రోజూ మీటింగ్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది.  ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. .. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

లిక్కర్​  స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలను బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొంటున్నారు. దీని మీద చాలా కాలంగా ఈడీ విచారణ జరుపుతూ ఉంది.  ఈ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. సౌత్‌ లాబీ పేరుతో లిక్కర్‌ స్కాంలో కీలకకంగా వ్యవహరించారు. ఆప్‌ పార్టీకి వంద కోట్లు ఇవ్వడంలో కవిత కీలకపాత్ర ధారి. కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు. పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు. ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారని.... రూ. 30 కోట్లను అభిషేక్‌ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది.అప్​కు 100 కోట్లు ఇవ్వడంతో కవిత కీలక పాత్ర వహించారని ఈడీపేర్కొంది.