
- ఆ లెటర్ కేటీఆర్, హరీశ్‌రావు తయారు చేయించి వదిలారు
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత లేఖ ఉత్తదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ పై ఎంత సేపు మా ట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా? అని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావులే ఈ లేఖ తయారు చేయించారని ఆరోపించారు.
ఆ లేఖను కవిత పేరుతో బయటకు వదిలారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమని ఈ లేఖతోనే బీఆర్ఎస్... బీజేపీ బంధం బయటపడిందని చెప్పాడు. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపో యిందని తేలిపోయిందన్నారు. అందుకే ఈ డ్రామాలని అన్నారు.